ఏపీ ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు..!

తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగా ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.ఏపీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు సూచించారు.ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలుగా నిర్ణయించారు.ఈ నెల 30 వరకు కర్ఫ్యూ కొనసాగుతుండగా అప్పటివరకు ఇవే పనివేళలు ఉంటాయని సీఎస్ ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు.పనివేళల మార్పుని సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు, అన్ని విభాగాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు అయితే రాష్ట్రంలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ సడలింపులు ఇవ్వలేదు.

 Ap Government Employees Timings Changed-TeluguStop.com

అక్కడ మధ్యాహ్నం వరకు మాత్రమే సడలింపు ఉంది.

అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పనిచేస్తారని తెలిపారు.ఏపీలో మొన్నటివరకు రోజుకి 10 వేలు తగ్గకుండా కేసులు రాగా క్రమంగా కేసులు అదుపులోకి వచ్చాయి.ప్రస్తుతం అక్కడ రోజుకి 5 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

 Ap Government Employees Timings Changed-ఏపీ ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఏపీలో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది.రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతున్నా సరే కరోనా కంట్రోల్ అయ్యే వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

#Andhrapradesh #Telangana #Employees #Changed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు