ఆరోగ్య శ్రీ పరిధిలో బ్లాక్ ఫంగస్.. ఎక్కడో తెలుసా..?

కరోనా మహమ్మారి విజృంభన ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే.రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజలను కష్టాల పాలు చేస్తుంది.

 Ap Government Declares Block Fungus In Arogya Sri Treatment-TeluguStop.com

ఇక కరోనా నుండి ఎలాగోలా బయటపడ్డాం అనుకున్న వారికి కొత్తగా బ్లాక్ ఫంగస్ అని ఒకటి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంది.బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కరోనాతో పాటుగా బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ పరిధిలో తీసుకువస్తున్నామని వెళ్లడించింది.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై దృష్టి పెట్టామని చెప్పారు.

 Ap Government Declares Block Fungus In Arogya Sri Treatment-ఆరోగ్య శ్రీ పరిధిలో బ్లాక్ ఫంగస్.. ఎక్కడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిఎం జగన్ బ్లాక్ ఫంగస్ పై కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకుంటున్నారు అంతేకాదు కొన్ని కేసులు సీరియస్ కండీషన్ లోకి వెళ్లడమే కాకుండా మృతి చెందడం కూడా జరిగింది.

ఇక నుండి బ్లాక్ ఫంగస్ కూడా ఆరోగ్య శ్రీ కింద వస్తుందని అన్నారు.ఇక కేసుల సంఖ్య పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా నిబంధనలు అనుగుణంగా ఉండాలని అన్నారు.

ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నారని ఆళ్ల నాని అన్నారు.రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం వల్ల కేసులు తగ్గాయని అన్నారు.

#Corona #Treatment #COVID-19 #ArogyaSri #Black Fungus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు