రఘురామకృష్ణంరాజు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు లో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం..!! 

ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే రీతిలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుట్రపన్నారని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే.హైదరాబాదులో ఆయన పుట్టిన రోజు నాడు అరెస్టు చేసిన సిఐడి పోలీసులు వెంటనే ఏపీకి తీసుకువచ్చి కోర్టులో హాజరు పరచడం జరిగింది.

 Ap Government Counter Petition In Supreme Court Against  Raghurama Krishnam Raju-TeluguStop.com

ఈ క్రమంలో తనపై పోలీసులు చేసుకున్నట్లు రఘురామకృష్ణంరాజు న్యాయమూర్తి ముందు ఫిర్యాదు చేయటంతో .కోర్టు ఆదేశాల మేరకు రఘురామకష్ణంరాజు కి వైద్య పరీక్షలు నిర్వహించారు.అయితే అవి పోలీసులు కొట్టిన దెబ్బలు కాదని.వైద్య పరీక్షల్లో తేలింది.ఇదే క్రమంలో హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది.దీంతో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు కి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆర్మీ ఆసుపత్రిలో జరిగేలా ఆదేశాలు ఇవ్వడం మనకందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజు వేసిన బెయిల్ పిటిషన్ కి తాజాగా ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

పోలీసులు కొట్టారు అన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని తోసిపుచ్చింది.ఒకవేళ అదే నిజమైతే ప్రభుత్వం వైద్య పరీక్షలకు అంగీకరించేది కాదు కదా అని కౌంటర్లో తెలిపింది.

ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచేలా కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని ఆయన బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కౌంటర్లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.పొరపాటున కాకుండా కావాలనే తప్పుడు ఉద్దేశం తో కుట్ర పన్నుతు  రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని సుప్రీంకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి రఘురామకష్ణంరాజు కి బెయిల్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube