ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నది బోర్డు లేఖ..!

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములో ముందుకు వెళ్లవద్దని కృష్ణా నదీ బోర్డు ఏపీ సర్కారును ఆదేశించింది.

 Ap Government, Cm Jagan, Krishna River Management Board, Telangana Government, R-TeluguStop.com

కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా నది బోర్డు తప్పుబట్టింది.ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు హరికేష్ మీనా.

రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు.నూతన ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా మందుకు వెళ్లకూడదని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నది బోర్డు హెచ్చరించింది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పున్వరిభజన చట్టానికి విరుద్ధమైందని కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కృష్ణా వాటర్ బోర్డు లేఖ రాస్తూ.

అక్రమ ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని లేఖలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 84, పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని కృష్ణా బోర్డు తప్పుబట్టింది.

కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను ముందుగా సమగ్ర నివేదిక (డీపీఆర్) ను కేంద్ర జల వనరుల సంఘానికి సమర్పించి అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని సూచించింది.దీనికి భిన్నంగా ఏపీ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్ని ఉల్లఘించడం కిందకే వస్తాయని కృష్ణా రివర్ బోర్డు పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube