మహారాష్ట్రకు బిగ్ హెల్ప్ చేస్తున్న ఏపీ..!!

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్ర లో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడ బెడ్లు కొరతతో పాటు ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడింది.

 Ap Government Big Help To Maharashtra By Supplying Oxygen , Uddhav Thackeray, Ys-TeluguStop.com

ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుండి హెల్ప్ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.గత కొన్ని రోజుల నుండి మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా 10 ట్యాంకర్లతో 150 టన్నులు పంపించడం జరిగింది.

అయినాగానీ సరిపోకపోవడంతో తాజాగా విశాఖ నుంచి మహారాష్ట్రకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పంపించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుండి విశాఖకు ఆక్సిజన్ రైలు రావడం జరిగింది.

కరోనా రోగులకు చికిత్స విషయంలో ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తుంది.ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పరిస్థితి దారుణం గా ఉండటంతో.అక్కడ ఆక్సిజన్ కొరత తీర్చేలా.ఏపీ బిగ్ హెల్ప్ చేస్తూ ఉంది.

ఒక మహారాష్ట్ర కి మాత్రమే కాక ఇతర రాష్ట్రాలకు కూడా ఏపీ ఆక్సిజన్ పంపిణీ చేస్తూ ఉంది.గతంలోనే కేంద్రం ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు భారీగా ఏర్పాటు చేసుకోవాలి అంటూ రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఆ క్రమంలో చాలా రాష్ట్రాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.ఏపీలో జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొంది.

Telugu Ap Big, Corona Wave, Corona, Covid, Jagan, Maharashtra, Oxygen Supply, Ox

రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఏపీ లో ఉంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత బట్టి చూస్తే 50 నుండి 60 మెట్రిక్ టన్నులు మాత్రమే వాడుతున్నారు.దీంతో మిగతా రాష్ట్రాలలో ఎక్కడైతే ఆక్సిజన్ కొరత ఉందో అక్కడ .ట్యాంకర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్ పంపిణీ చేస్తూ ఉంది.ఈ విధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు అనేక జిల్లాలకు వారం రోజుల్లో ఏడు వందల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయడంలో జగన్ ప్రభుత్వం కీలకంగా మారింది. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజల ప్రాణాలను రక్షించడంలో కూడా ప్రధాన పాత్ర దేశంలోనే ఏపీ ప్రభుత్వం పోషిస్తున్నట్లు అయింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube