ఆన్ లైన్ పేకాట ప్రియులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం...!

ఆన్ లైన్ జూద ప్రియులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే… రాష్ట్రంలో ఆన్లైన్ జూదాన్ని నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

 Ap Govt Bans Online Games Like Rummy Poker,ap Government, Ys Jagan, Cabinet Meet-TeluguStop.com

నేడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ విషయం సంబంధించి పేకాట రమ్మీ, పోకర్ లాంటి ఆన్లైన్ జూద క్రీడలను నిషేధిస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

ముందుగా ఈ కేబినెట్ విషయంలో పలు అంశాలపై చర్చ జరిగింది.చివరగా ఆన్ లైన్ పేకాట కు సంబంధించి కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.ఆన్ లైన్ విధానం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరాలని, ఆన్లైన్ విధానం ద్వారా అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోకూడదని, ఈ ఆన్ లైన్ ద్వారా ఎంతోమంది డబ్బు కోసం ఆన్లైన్ పేకాట నిర్వహిస్తూ రాష్ట్రంలోని యువతను తప్పుదారి పట్టిస్తున్నట్లు సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం వన్ ఆన్ లైన్ జూద క్రీడలను నిషేధించింది.

Telugu Andhrapradesh, Ap, Apbans, Games, Rummy, Poker, Ys Jagan-Latest News - Te

ఇక ఈ విషయంపై ఏపీ రాష్ట్ర సర్కార్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది.ఇకపై ఎవరైతే ఆన్ లైన్ లో జూద క్రీడలను నిర్వహిస్తారో వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించినట్లు నిర్ణయం తీసుకున్నారు.ఇలా ఆన్ లైన్ లో జూదం నిర్వహించే వారికి మొదటి సారి పట్టుబడితే వారికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.అలాగే వారి పరివర్తన మార్చుకోకుండా మరోసారి కనుక పట్టుబడితే వారికి రెండేళ్ల కఠిన శిక్షతోపాటు భారిగా జరిమానా కూడా విధిస్తారు.

కేవలం జూదం నిర్వహించే వారికి శిక్షలు అని ఆనందపడుతున్నారా…? అలా ఏం లేదు జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల కఠిన శిక్ష విధించబడుతుందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్.కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటినుంచి ఎవరైనా ఆన్ లైన్ లో జూద క్రీడలు ఆడాలంటే ఇక భయపడాల్సిందే.

ఇక చివరగా ఇందుకు సంబంధించి జీవో ను జారీ చేసేందుకు క్యాబినెట్ తీర్మానం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube