హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయి తేజ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!!

భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తో పాటు పన్నెండు మంది ఇటీవల తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం తెలిసిందే.ఏకంగా 13 మంది మరణించడంతో పాటు సైనిక కీలక అధికారి మరణించటం.

 Ap Government Announces Ex Gratia To Sai Tej Family Details, Sai Tej, Bipin Raw-TeluguStop.com

దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.దీంతో బిపిన్ రావత్ మరణం పట్ల.

దేశ ప్రధానితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కీలక రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు.

ఇక ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన జవన్ సాయి తేజ్ మరణం పట్ల ఏపీ అధికార పార్టీ అదేవిధంగా విపక్ష పార్టీలకు చెందిన నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాయి తేజ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ్ మృతదేహానికి ఇప్పటికే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి గుర్తించి.

తాజాగా అధికారులు కుటుంబానికి అందించడానికి చిత్తూరు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం.

మరణించిన జవాన్ సాయి తేజ కుటుంబానికి త్వరలోనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో త్వరలోనే చెక్ అందించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube