డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వంపై అనుమానం వుంది! సైబరాబాద్ సీపీ!

ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం సేవా మిత్ర యాప్ ని నడిపిస్తూ, దాని ద్వారా ఏపీలో ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆ సంస్థ మీద కంప్లైంట్ నమోదైన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు విచారణ మొదలెట్టి ఐటీ గ్రిడ్స్ మీద దాడి చేసి విలువైన సమాచారం తెలుసుకున్నారు.

 Ap Government Accuse In Voter Data Thefting Case-TeluguStop.com

ఐటీ గ్రిడ్ సంస్థకి సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలు ఎలా వచ్చాయని, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తాజాగా మీడియా సమావేశంలో డేటా చోరీ గురించి ఆసక్తికర విషయాలు ఆయన బయట పెట్టారు.

ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం ఒక ప్రైవేట్ సంస్థ చేతిలోకి వచ్చింది అంటే ఏపీ ప్రభుత్వం మీద అనుమానం కలుగుతుందని తెలిపిన సీపీ ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకుడు అశోక్ పరారిలో ఉన్నాడని, అతను లోన్గిపోయాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు.అలాగే ఏపీలో నమోదైన ఓ మిస్సింగ్ కేసు కోసం ఏసీపీ స్థాయి అధికారి హైదరాబాద్ రావడంలో కూడా ఏపీ పోలీసుల అత్యత్సాహం కనిపిస్తుందని, దీని వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని సజ్జనార్ మీడియాతో తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube