యువత కోసం ఏపీ ప్రభుత్వం కొత్త శాఖ  

AP Governament Introduce The Skill Development And Training For Un Employement - Telugu Ap Assembly Meetings Start Today, Ap Governament, , Ap Governament Take The New Jivo

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈసమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కొత్త శాఖను తీసుకు వస్తున్నట్లుగా ప్రకటించింది.

Ap Governament Introduce The Skill Development And Training For Un Employement

రాష్ట్రంలోని యువతకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగం కల్పించేందుకు ఈ కొత్త శాఖ పని చేయబోతుంది.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మరియు ట్రైనింగ్‌ పేరుతో ఈ శాఖ పని చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్తగా రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఖచ్చితంగా స్థానికులను తీసుకోవాలంటూ జీవో తీసుకు వచ్చారు

స్థానికులకు పరిశ్రమలో అవకాశం ఇవ్వాలంటే వారి వద్ద స్కిల్స్‌ ఉండాలి.అందుకే వారికి స్కిల్స్‌ను నేర్పించేందుకు ఈ శాఖను ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ శాఖ ఖచ్చితంగా యువతకు మంచి ఉపయోగదాయకం అంటూ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.ప్రస్తుతం యువత ఏపీలో నిరుద్యోగంతో బాధపడుతున్నారు.

వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగంలో పెట్టించేందుకు ఈ శాఖ కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.

#AP Governament

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Governament Introduce The Skill Development And Training For Un Employement Related Telugu News,Photos/Pics,Images..