ఆ థియేటర్ యాజమాన్యాలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతోపాటు ఆన్ లైన్ బుకింగ్ విధానం తీసుకు రావటం.

 Ap Governament Gave Permisssion To Re Open Sease Theaters Ap Governament, Perni-TeluguStop.com

బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవటం వంటి నిర్ణయాలు ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారాయి.పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా సంక్రాంతి సీజన్ అతి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో.

నిబంధనలు పాటించని థియేటర్లపై తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు.

మంత్రి పేర్ని నానితో దాదాపు గంటన్నర సేపు సమావేశం అవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల తనిఖీలు చేపట్టి సీజ్ చేసిన 83 థియేటర్ల యాజమాన్యాలకు.తిరిగి ఓపెన్ చేసుకోవచ్చని.ఆంక్షలు విధిస్తూ అన్ని సౌకర్యాలు థియేటర్ లో  ఉండేలా.చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.సరిగ్గా సంక్రాంతి సీజన్ ముందు పైగా పెద్ద సినిమాలు రీలీజ్ అయ్యే టైంలో.సీజ్ చేసిన థియేటర్లకు ప్రభుత్వం మళ్లీ పరిమిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు అర్థమవుతుంది.

ఇక ఇదే క్రమంలో టిక్కెట్ల ధరల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మరికొంతమంది తాజా పరిస్థితులపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube