కరోనా ట్రీట్మెంట్ అంటూ అధిక ఫీజులు వసూలు చేసిన హాస్పిటల్ కి ఏపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్..!!

మహమ్మారి కరోనా చికిత్స విషయంలో జగన్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.పేద వాళ్ళ దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ముందు నుండి వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం.

 Ap Governament Fines Sai Sudha Hospital Kakinada, Ys Jagan, Sai Sudha Hospital,-TeluguStop.com

అదే రీతిలో కరోనా చికిత్స ధరలకు సంబంధించిన పట్టిక బోర్డు హాస్పిటల్  బయటపెట్టాలని ఆదేశించారు.ప్రతి హాస్పిటల్లో ఈ విధంగా బోర్డు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కలిగిన పట్టిక అమర్చాలని సూచించారు.

ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా గాని.కొన్ని హాస్పిటల్స్ ప్రజల దగ్గర దోచుకుంటూనే వున్నాయి.

ఈ రీతిలోనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కంటే పేషెంట్ల దగ్గర అధిక రీతిలో డబ్బులు వసూలు చేయడంతో బయటపడటంతో ఏపీ ప్రభుత్వం డబ్భై ఐదు లక్షలకు పైగా జరిమానా విధించి రెండు రోజుల్లో ఆరోగ్యశ్రీ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

కరోనా చికిత్స విషయంలో ఒక వ్యక్తి దగ్గర పది లక్షలకు పైగా డబ్బులు ఆసుపత్రి యాజమాన్యం తీసుకోవటంతో… మృతుడి బంధువులు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఆరోగ్యశ్రీ శిక్షణా కమిటీ.విచారణ చేపట్టి.

అంత వాస్తవం అని తేలడంతో మృతుడి కుటుంబాలకు చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టినా డబ్బులు చెక్కు రూపంలో అందించి హాస్పిటల్ కి భారీగా జరిమానా విధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube