ఈ సమయంలో పెంపు ఏంటీ జగన్‌ గారు?

గత నెలన్నర రోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా వైన్స్‌ మూత పడి ఉన్న విషయం తెల్సిందే.అయితే నేటి నుండి అమలు కాబోతున్న లాక్‌డౌన్‌ 3.0 లో వైన్స్‌కు అనుమతిని ఇవ్వడం జరిగింది.లాక్‌డౌన్‌ ఉన్నా కూడా వైన్స్‌ను అమ్మేందుకు అనుమతులు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా వైన్స్‌ ఓపెన్‌కు అనుమతులు జారీ చేయడం జరిగింది.

 Ap Governament 25 Percent Extra Charge On Every Alchohal Brand-TeluguStop.com

పెద్ద ఎత్తున జనాలు వైన్స్‌ వద్ద గుమ్మి గూడకుండా ఉండేలా చూడటంతో పాటు సిట్టింగ్‌ లేకుండా అనుమతులు ఇవ్వడం జరిగింది.ఏపీలో నేడు వైన్స్‌ ఓపెన్‌ కాబోతున్నాయి.

ఇది ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ అయినా ప్రభుత్వం మాత్రం బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది.

 Ap Governament 25 Percent Extra Charge On Every Alchohal Brand-ఈ సమయంలో పెంపు ఏంటీ జగన్‌ గారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీలోని వైన్స్‌లో విక్రయించే ప్రతి బ్రాండ్‌పై 25 శాతం అదనంగా వసూళ్లు చేయబోతున్నారు.మద్యం రేట్లు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.25 శాతం అధిక రేటుకు మద్యంను అమ్మబోతున్నారు.ఈ లెక్కన జనాల జేబుకు భారీగానే చిల్లు పడబోతుందన్నమాట.కొన్నాళ్ల క్రితమే ఏపీలో మద్యం రేట్లు పెంచడం జరిగింది.ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం నష్టాలను భర్తీ చేసుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు చెబుతున్నారు.

#Jagan #Wine Shops #AP Coronavirus #AP Governament #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు