టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై సిట్ విచారం! జగన్ కీలక నిర్ణయం  

Ap Forms Sit To Probe Tdp Govt\'s Schemes & Projects - Telugu Ap Cm Jagan, Ap Forms Sit, Ap Politics, Probe Tdp Govt\\'s Schemes & Projects, Tdp, Ysrcp

అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీని అన్ని రకాలుగా ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తుంది.టీడీపీ పార్టీ మళ్ళీ కోలుకునే అవకాశం లేకుండా చేయాలని చూస్తున్న జగన్ సర్కార్ గత ప్రభుత్వం హయాంలో జరిగిన అన్ని అవినీతి, అక్రమాలు బయట పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.

Ap Forms Sit To Probe Tdp Govt's Schemes & Projects

అందుకుగాను టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, కార్పోరేషన్లు, సొసైటీలలో జరిగిన అవకతవకలపై తెలుసుకోవాలని గత ఏడాది మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసారు.ఈ కమిటీ తాజాగా నివేదిక ఇచ్చింది.

ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్ళ కాలంలో అనేక అక్రమాలు జరిగాయని, అడ్డగోలుగా అవినీతి జరిగిందని తెలిపారు.ఈ నివేదిక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ని ఏర్పాటు చేసింది.టీడీపీ పాలకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అవినీతి, అక్రమాలని బయటకి తీసేందుకు సిట్‌తో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు నిన్న రాత్రి ఓ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందుకోసం నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురాం నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది.ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం సిట్‌కు ఉందని జీవోలో పేర్కొంది.ఇప్పటికే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆర్ధిక లావాదేవీలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉండటంతో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు