గుండెపోటుతో మరణించిన మాజీ మంత్రి, వైసీపీ నేత.. !

ఈ మధ్య కాలంలో కాస్త వయస్సు మళ్లిన రాజకీయ నేతలు ఎక్కువగా మరణిస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా అయితే నేమి, ఇతర అనారోగ్య సమస్యల కారణాలు అయితే నేమి మొత్తానికి మాత్రం ప్రాణాలు విడిచారు.

 Ap Former Minister Ycp Leader Mohammed Jani Died Of Heart Attack ,ap, Former Min-TeluguStop.com

ఇంకా విడుస్తున్నారు.

ఇదే క్రమంలో మరో నేత ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోయింది.

ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత మహ్మద్ జానీ (74) నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు.ఇకపోతే గుంటూరు-1 నియోజక వర్గం నుంచి 1985, 1989 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌లో పాతతరం నేతగా గుర్తింపు పొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యువజన సర్వీసులు, చిన్న పరిశ్రమల మంత్రిగా, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా, నాలుగేళ్ల పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సేవలు అందించారు.కాగా జానీ మృతికి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముస్తాఫా తదితరులు సంతాపం ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube