చంద్రబాబుకి షాక్…రాజీనామా చేయనున్న మంత్రి     2017-09-16   01:22:54  IST  Bhanu C

-

-

చంద్రబాబు కి ఏపీ బీజేపి నేతలకి మధ్య పొసగడం లేదు అనడానికి ఈ మధ్య జరిగిన పరిణామాలే సమాధానం అవుతున్నాయి.ఇప్పుడు మరొక అసంతృప్తి బీజీపీ మంత్రి చంద్రబాబు మీద గుర్రుగా ఉన్నారు.అంతేకాదు కేబినెట్ కి కూడా గుడ్ బాయ్ చెప్పబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ బీజేపి మంత్రి ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాల రావు.

మూడేళ్ళుగా అవమానాలు భరిస్తూనే ఉన్నాను అని,ఈ మధ్య ఇవి మారీ తారాస్థాయికి చేరుకున్నాయి అని కొందరు నేతలతో అంటున్నారట.ఈ విషయాన్ని బీజీపీ దృష్టికి తీసుకువెళ్తాను అని కూడా అన్నారట.త్వరంలోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని తన అసంతృప్తిని వెల్లడించారు అని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై ఆయనదే అజమాయిషీ. కానీ ఒక్క గుడి విషయంలో మాత్రం ఆయనకు అనేక అవమానాలు ఎదురవుతున్నాయట. అదే ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం. ఇక్కడి పాలకమండలి మంత్రికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదట. పాలక మండలి ధోరణి ఎంతగా పెరిగిపోయింది అంటే.

ఈ నెలలో జరిగే దసరా ఉత్సవాలకు సంభందించిన ఏర్పాట్లపై పెట్టిన మీటింగ్ కి సాక్షాత్తూ దేవాదాయశాఖ మంత్రికి ఆహ్వానం ఇవ్వలేదట.పైగా దేవాదాయ శాఖ తో సంభందం లేని మంత్రి దేవినేని ఆ మీటింగ్ ని దగ్గర ఉండి నడిపించారట. అయితే గురువారం జరిగిన సమావేశం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి మంత్రి దేవినేనికి ఆహ్వానం అందింది కానీ దేవాదాయ శాఖ మంత్రికి మాత్రం అందలేదు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే బీజీపికి పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా ఉంది అని అనుకుంటున్నారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీజీపీ నాయకులు..ఈ విషయాన్ని బీజేపి అధిష్టానం వద్ద తేల్చుకోవాలని భావిస్తున్నారు.