ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు ..? నోటిఫికేషన్ తేదీ ఇదేనా ...?

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల కావొచ్చు అనే టెన్షన్ లో రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నాయి.అందుకే… ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు అధికార పార్టీ టిడిపి …అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి ఇప్పటికే ప్రజల్లో పరపతి పెంచుకే ప్రయత్నం చేస్తుంది.ఇక వైసిపి కూడా కొత్త కొత్త హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.ఈ హడావుడి ఇలా ఉండగానే… ఏపీలో ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే బయటకు రాబోతున్నట్టు తెలుస్తోంది.

 Ap Elections Schedule Announced From Election Commission-TeluguStop.com

గత సార్వత్రిక సార్వత్రిక ఎన్నికలను మే మొదటి వారం వరకు నిర్వహించిన ఈ సి ఈసారి మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి మీ చివరి వారానికి ఏప్రిల్ చివరి వారానికి ముగించాలని చూస్తోందట.

ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం ఈ నెల 28 న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించి మే మొదటి వారంలో ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తే బాగుంటుందని ఆలోచనలు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్టు సమాచారం.ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు అందరూ ఇప్పటికే నివేదికను అందించారు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన పారా మిలటరీ బలగాలు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మధ్యనే ఈ నివేదిక అందించింది.

అలాగే ఈసారి ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడింది.రాజకీయ పార్టీల అంచనాల ప్రకారం మార్చి చివర్లో గానీ ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ చివరిదైన కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ మే మొదటి వారంలో ఉండొచ్చట.అలాగే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి.మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి .ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఈసీ ఉంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube