చెదురు మదురు ఘటనలతో ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక

ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ చెదురు ముదురు ఘటనల మినహా చాలా ప్రశాంతంగా ముగిసింది.ఈ సందర్భంగా ఉప ఎన్నికకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడటం జరిగింది.

 Ap Election Officer Mukesh Kumar Meena Sensational Comments On Atmakur Bypoll , Atmakur Bypoll, Bjp, Ysrcp-TeluguStop.com

ఉప ఎన్నికలలో 14 మంది అభ్యర్థులు పోటీ పడ్డారని ఏడు చోట్ల ఈవిఎం లు ఒక చోట వీవీ ప్యాడ్ లలో కొద్దిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.అనంతరం పరిష్కారం చేసి ఎన్నికల సాజావుగా నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు.

దాదాపు 70 శాతం పైగా పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.గత ఎన్నికలలో 82 శాతం పోలింగ్ జరిగిందని గుర్తు చేశారు.

 AP Election Officer Mukesh Kumar Meena Sensational Comments On Atmakur Bypoll , Atmakur Bypoll, BJP, YSRCP -చెదురు మదురు ఘటనలతో ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుందని ముఖేష్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇండిపెండెంట్ అభ్యర్థులు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పట్టించుకోవడం లేదని కొంతమంది ఆరోపించడం జరిగింది.

ముఖ్యంగా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో.ఇండిపెండెంట్ అభ్యర్థి శశిధర్ రెడ్డి కి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.అనంతరం పోలీసులు అతడిపై సర్దిచెప్పి.పోలింగ్ కేంద్రం నుండి పంపించడం జరిగింది.

 ఈ ఉప ఎన్నికకు టిడిపి దూరం కావడంతో.కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్ఆర్సిపి మరియు బిజెపి కార్యకర్తల మధ్య చెదురు ముదురు వాగ్వివాదాలు తలెత్తాయి.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆత్మకూరు ఉప ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించిన సిబ్బందికి సీఈఓ అభినందనలు తెలియజేశారు.

ఈ నెల 26వ తారీకు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube