ఓట్ల తొలగింపు వదంతులు నమ్మొద్దు! ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేది!

ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్షల మధ్య అక్రమ ఓట్ల తొలగింపు వ్యవహారం రసవత్తరంగా సాగుతుంది.ప్రతిపక్ష పార్టీ తమ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుందని అధికార పార్టీ, కాదు తమ ఓట్లే అధికార పార్టీ తొలగించే ప్రయత్నం చేస్తుంది అని ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

 Ap Election Commission Give Assurance To Voters-TeluguStop.com

ఇక దీనికి సంబంధించిన కేసు ఇప్పుడు హైదరాబాద్ వేదికగా నడుస్తుంది.ఐటీ గ్రిడ్ అనే సంస్థ సేవా మిత్ర ద్వారా ఏపీలో ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటుంది.

ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా ఓ ప్రైవేట్ కంపెనీ దగ్గరకి ఎలా వచ్చాయనే ప్రశ్న కూడా పోలీసుల నుంచి వస్తుంది.

ఈ నేపధ్యంలో ఈ ఓట్ల తొలగింపు వ్యవహారం ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళింది.

ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చిన ఏపీ ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది 8 లక్షల ఓట్లు తొలగించమని అప్లికేషన్స్ వచ్చాయని, అయితే వాటిని ఉన్నపళంగా తొలగించడం జరగదని, మూడు దశలలో పరిశీలించి, ఓటర్ తనకి తానుగా ఓటు తొలగించమని చెబితేనే తొలగించడం జరుగుతుందని తెలియజేసారు.ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అక్రమంగా ఓట్ల తొలగింపుకి దరఖాస్తు వస్తే వాటికి బాధ్యులైన వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని స్పష్టం చేసారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube