టెన్త్, ఇంటర్ పరీక్షల గురించి కీలక కామెంట్ చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని తాజాగా తెలియజేశారు.

 Ap Education Minister Made Sensational Comments On Tenth, Inter Exams  , Ap Tent-TeluguStop.com

ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు అని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అంత మాత్రమే కాక జూన్ ఒకటవ తారీకు నుంచి స్కూల్ లకి టీచర్స్  హాజరుకావాలని తెలిపారు.

ఇతర రాష్ట్రాలలో పరీక్షలు నిర్వహించారని.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ పరీక్షల ఎపిసోడ్ అడ్డంపెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు విద్యార్థుల పేరెంట్స్ లో భయాందోళన కలిగించటానికి రెడీ అవుతున్నారని ఇది సరైన ఈ విధానం కాదని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.బయట పరిస్థితులు బాగోలేదు అలాగని విద్యార్థుల జీవితాలు నాశనం చేయకూడదు కదా అంటూ ఓ మీడియా ఛానల్ తో ఆదిమూలపు శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఉంటుంది కచ్చితంగా పరీక్షలు హాజరయితే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పరీక్షలు జూన్ 7వ తారీకు నుంచి నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube