ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమం లో భాగంగా 2020-21 ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు.2020-21 ఈఏపీసెట్ కు మొత్తం 2,59,688 మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1,75,868.

 Ap Eapset Results Released Ap Eapset, Adhimulapu Suresh,latest News-TeluguStop.com

వారిలో 1,34,205 మంది ఉత్తీర్ణులయ్యారు.ఈ క్రమంలో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

Telugu Ap Eapset, Ap, Corona, Vijayawada-Telugu Political News

పరీక్షకు హాజరైన వారిలో కేవలం ఐదుగురు మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు.ఇదే క్రమంలో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈనెల 14వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.అదే రీతిలో ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు సంబంధిత వెబ్ సైట్ లో రేపటి నుండి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ఈనెల 18నుండి జరుగుతుందని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube