డీఎస్సీ అప్ డేట్స్ : వెబ్ ఆప్షన్లు, హాల్‌టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలు విడుదల

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన షెడ్యూలును ఏపీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2018 (డీఎస్సీ) విడుదలచేసింది.ఈ షెడ్యూలు ప్రకారం అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సంబంధించి వెబ్‌ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు.

 Ap Dsc Web Options And Hall Ticket Schedule Released-TeluguStop.com

వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కొన్ని పోస్టులకు గురువారం (నవంబరు 22) నుంచి.మరికొన్ని పోస్టులకు శనివారం (నవంబరు 24) నుంచి ప్రారంభంకానుంది.

నవంబరు 28 వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది.ఎస్జీటీ పోస్టులకు మాత్రం డిసెంబరు 3 నుంచి 9 వరకు పరీక్షకేంద్రాల కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూలు, మార్కుల వివరాలు…

డిసెంబరు 6 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.విభాగాల వారీగా 2019 జనవరి 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి.ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలును కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.ఏపీలో మొత్తం 7,729 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా మొత్తం 6,08,157 దరఖాస్తులు వచ్చాయి.

మొత్తం 6,26,788 మంది అభ్యర్థులు ఫీజుచెల్లించగా.వారిలో 18,631 దరఖాస్తులను హాల్‌టికెట్ నెంబర్లు సరిగా నమోదు చేయలేకపోయారు.

వెబ్ ఆప్షన్ల హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలు.

పోస్టులు వెబ్ ఆప్షన్స్

స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) 22.11.2018 – 28.11.2018

స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) 22.11.2018 – 28.11.2018

పీజీటీ 22.11.2018 – 28.11.2018

టీజీటీ, ప్రిన్సిపల్స్ 24.11.2018 – 28.11.2018

లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ & డ్రాయింగ్ 24.11.2018 – 28.11.2018

ఎస్జీటీ 03.12.2018 – 09.12.2018

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ షెడ్యూలు.

పోస్టులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్

స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) 01.12.2018 నుంచి

స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) 03.12.2018 నుంచి

పీజీటీ 05.12.2018 నుంచి

టీజీటీ, ప్రిన్సిపల్స్ 09.12.2018 నుంచి

లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ & డ్రాయింగ్ 09.12.2018 నుంచి

ఎస్జీటీ 17.12.2018 నుంచి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube