ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో( Telugu states ) ఎండలు ప్రభావం బాగా కొనసాగుతూ ఉన్నాయి.ఉదయం 9 కాకముందే భానుడు భగభగ మండిపోతూ ఉన్నాడు.

 Ap Disaster Management Agency Alerts , Ap Disaster Management, Weather , Rohini-TeluguStop.com

దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది.ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో వడగాల్పులు ప్రభావం భారీగా ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 35 మండలాల్లో వడగాల్పులు.73 మండలాలలో తీవ్ర వడగాల్పులు వీచనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

ద్రోణి ప్రభావంతో మరోవైపు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయాని… పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో రోహిణి కార్తీ(Rohini Karti ) కొనసాగుతూ ఉంది.

జూన్ 4 వరకు రోహిణి కార్తి ప్రభావం ఉండనుంది.దీంతో రాష్ట్ర ప్రజలు ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి తరుణంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో… కొద్దిగా టెన్షన్ పడుతున్నారు.చిన్నపాటి వర్షాలు పడితే ఉక్క పూత.ఎక్కువైపోతదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube