గుజరాత్ లో పట్టుబడ్డ డ్రగ్స్ విషయంలో ఏపీ డీజీపీ సంచలన కామెంట్స్..!!

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుండి ఢిల్లీకి తరలిస్తున్న మాదకద్రవ్యాలు అక్రమ రవాణాలో గుజరాత్ లో పట్టుబడగా.ఈ కేసులో ఏపీకి సంబంధం ఉన్నట్లు.

 Ap Dgp Makes Sensational Comments On Drugs Seized In Gujarat-TeluguStop.com

వార్తలు రావడం తెలిసిందే.విజయవాడకి  సంబంధించిన అడ్రస్ పొందుపరిచినట్లు లింక్ ఉన్నట్లు.

మీడియాలో ప్రచారం జరిగింది.ఈ తరుణంలో విపక్షాలు తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటం జరిగాయి.

 Ap Dgp Makes Sensational Comments On Drugs Seized In Gujarat-గుజరాత్ లో పట్టుబడ్డ డ్రగ్స్ విషయంలో ఏపీ డీజీపీ సంచలన కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉంటే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ డ్రగ్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ లో పట్టుబడిన హెరైన్ కు ఏపీ కి ఎటువంటి సంబంధం లేదని, ఈ కేసుకు సంబంధించి విచారణ డీఆర్ఐ నార్కొటిక్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టం చేశారు.

కేసులో విజయవాడ పేరు రావడానికి గల కారణం కేవలం అడ్రస్ మాత్రమే పొందుపరచారని, అంతకుమించి డ్రగ్స్ కి విజయవాడ నగరానికి ఎటువంటి సంబంధాలు లేవని గౌతమ్ సవాంగ్ చెప్పుకొచ్చారు.చెన్నై నగరం వేదికగా మొత్తం లావాదేవీలు జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే సిఎం కార్యాలయానికి సమీపంలోనే డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని అటువంటిదేమీ లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఖండించారు.

#Gujarat #Afghanisthan #Dgp #Gautam Sawang #Vijayawada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు