గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం అనేక విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని కొన్ని వ్యవహారాలపై ప్రతిపక్షాలు అదేపనిగా విమర్శలు చేస్తున్నాయి.
దీంతో తమకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రభుత్వం జారీచేసే జీవోలను ఆన్లైన్ లో పెట్టకూడదని, మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఆఫ్ లైన్ లోనే ఉంచాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా, విమర్శలు రాకుండా చాలా వరకు జీవోలను ప్రభుత్వం రహస్యంగానే విడుదల చేస్తోంది.అయితే అవన్నీ ఆన్లైన్ లో పెట్టడంతో , అవి బట్టబయలు అవుతూ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుండడంతో, ఇకపై ఆఫ్లైన్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ఎంచుకుంది.
వాస్తవంగా 2008 నుంచి ప్రభుత్వ జీవోలన్నిటిని ఆన్లైన్ లోనే ఉంచుతున్నారు.కొన్ని కొన్ని జీవో లను మాత్రమే రహస్యంగా ఉంచేవారు. ప్రభుత్వ జీవో లన్నిటిని ఆన్లైన్ విధానంలో ఉంచడం వల్ల, ఏ ఏ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నారు అనే వివరాలు అందరికీ తెలిసేవి.అయితే ఇప్పుడు నా అవకాశం లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఏపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.జగన్ తీసుకున్న నిర్ణయాలు జనాల్లోకి వెళ్లడంతో ఏపీ ప్రభుత్వం కోర్టు ద్వారా ఆ వ్యవహారాలను తేల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు అనేక కేసుల విషయంలో పోరాడుతోంది.అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ నిధులను లాయర్లకు ఫీజుల కింద చెల్లిస్తూ ఉండడం వంటి వ్యవహారాలు ఇబ్బందులు తీసుకు వస్తాయి అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టుగా అర్ధం అవుతోంది.
అయితే ఈ వ్యవహారం పై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం మొదలుపెట్టేందుకు సిద్ధం అవుతోంది.