ప్లాస్మా దానం చేసిన డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా..!

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.

 Ap Deputy Cm Amzadh Basha Donate The Plasma Ap, Deputy Cm Amzad Basha, Plasma D-TeluguStop.com

ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు కరోనాను జయించిన వారు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.

గత కొన్నిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాకి కరోనా వైరస్ సోకిన సంగతి అందరికి తెలిసిందే.కరోనా నుండి కోలుకున్న ఆయన గురువారం నాడు కడప రిమ్స్ ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మతో కలిసి ప్లాస్మా డొనేట్ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.కరోనా బారి నుండి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలను అమలులోకి తీసుకొచ్చారని తెలిపారు.అంతేకాకుండా కోవిడ్ ఆసుపత్రులలో ప్లాస్మా కేంద్రాలను ప్రారంభించాలని సీఎం జగన్ ని కోరారు.ఈ వైరస్ బారి నుండి కోలుకున్నాక రెండు వారాలలో యాంటీ బాడీస్ పెరుగుతాయని తెలిపారు.

కరోనాని జయించిన ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు.

ఈ మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలని కోరారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంతవరకు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube