ఏపీ డిప్యూటీ సీఎం కు కరోనా…!  

AP Deputy CM Amzad Basha tested corona positive, AP Coronavirus,YSRCP, Ap Deputy CM Amzad Basha, Amzad Basha Coronavirus, AP CM Jagan, Jagan Kadapa Tour, Amzadh Bash Home Quarantaine - Telugu Amzad Basha Coronavirus, Amzadh Bash Home Quarantaine, Ap Cm Jagan, Ap Coronavirus, Ap Deputy Cm Amzad Basha, Jagan Kadapa Tour, Ysrcp

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించేస్తున్న విషయం విదితమే.దేశంలో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

 Ap Deputy Cm Amzad Basha Coronavirus

అయితే సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా ఈ కరోనా మహమ్మారి అల్లాడిస్తుంది.ఇప్పటికే ఈ కరోనా పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు వారి వద్ద పనిచేసే సిబ్బందికి కూడా పాజిటివ్ వస్తుండడం తో పెద్ద తలనొప్పిగా మారింది.

ఇప్పటికే తెలంగాణా లో కొందరు ప్రజా ప్రతినిధులతో పాటు వారి వద్ద పనిచేసే సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీ డిప్యూటీ సీఎం కు కరోనా…-Political-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా కు కూడా కోవిడ్-19 నిర్ధారణ అయినట్లు వార్తలు వెల్లడవుతున్నాయి.

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన నేపథ్యంలో… పలువురు ప్రజాప్రతినిధులకు‌, నేతలకు, పాత్రికేయులకు అధికారులు కరోనా టెస్ట్‌లు నిర్వహించడం తో ఈ విషయం వెలుగులోకి వస్తుంది.ఈ పరీక్షల్లో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఆయన గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

దీంతో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను హోం క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు.దీనితో సీఎం జగన్ కడప పర్యటనకు కూడా అంజాద్ భాషా దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

రేపటి నుంచి 28 రోజుల పాటు అంజాద్ భాషా హోం క్వారంటైన్‌లో ఉండనుండగా, అధికారులు మరోసారి ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.అయితే అధికారికంగా ఇంకా ఈ విషయం బయటకురాకపోయినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం కి కరోనా అన్న ప్రచారం మాత్రం కొనసాగుతుంది.

ఇప్పటి కే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం విదితమే.మొత్తం 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా,2 వందలకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.

#Ysrcp #AP CM Jagan #AP Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Deputy Cm Amzad Basha Coronavirus Related Telugu News,Photos/Pics,Images..