కుల వివాదంలో స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి.. !

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చుట్టూ కుల వివాదం అలుముకున్న విషయం తెలిసిందే.తాను ఎస్టీని కాదంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా పాముల పుష్ప శ్రీవాణి స్పందించారు.

 Ap Deputy Chief Minister Responds To Caste Controversy-TeluguStop.com

నేను ఎస్టీని కాకపోతే 2014 లో తన కుటుంబం మొత్తానికి డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను అధికారులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.

తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే కొందరు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 Ap Deputy Chief Minister Responds To Caste Controversy-కుల వివాదంలో స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇంకా తన విషయంలో వాస్తవాలను తెలుసుకోవాలంటే శ్రీకాకుళం మండలం పాలకొండ నియోజకవర్గం లోని టీడీ పారాపురం వెళ్లి అడిగితే మీ అనుమానాలకు సమాధానం దొరుకుతుందని తెలిపారు.

రాజకీయ కక్షతో తన పై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కాదని, ఒకవేళ ఇలా మాట్లాడే వారు ఈ విషయాన్ని రుజువు చేయాలని సవాలు విసిరారు డిప్యూటీ సీఎం.

నిజనిజాలు గ్రహించకుండా ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో భవిష్యత్తులో బయటపడుతుందని వెల్లడించారు.

#Respond #Pushpa Sreevani #DeputyChief

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు