ఏపీ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు ఇవే..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ కరోనాపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణతో పాటుగా కొంతమంది అధికారులు పాల్గొన్నారని తెలుస్తుంది.

 Ap Curfew Relaxation Rules Corona , Alla Nani, Ap, Bosta Satyanarayana, Corona,-TeluguStop.com

కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.ఇక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి కూడా సంబందించిన డీటైల్స్ అన్ని అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.

ఏపీలో కర్ఫ్యూ నిబంధనలను మరింత సడలింపులు చేశారు.కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు.

తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలకు వేరు వేరుగ కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటివరకు ఉన్నాయి.కాని ఇక మీదట అన్ని జిల్లాలకు ఒకే విధమైన కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు.

రాత్రి 9 గంటలకు అన్ని షాపులు క్లోజ్ చేయాల్సి ఉంటుంది.ఇక షాపింగ్ మాల్స్, దుకాణాల్లో సిబ్బందితో పాటుగా కొనుగోలు దారులు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తే షాపులకు ఫైన్ విధిస్తారని తెలుస్తుంది.ప్రజలు మాస్క్ ధరించకపోతే 100 రూ.లు జరిమానా విధిస్తున్నారు. రాత్రి కర్ఫ్యూని కఠినంగా నివహించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube