మరోసారి బాబు కు నోటీసులు జారీ చేసిన సీఆర్డీఏ అధికారులు  

Crda Officials Once Again Issues Notice To Chandrababu Naidu\'s House-crda,once Again Issues Notice To Chandrababu Naidu,praja Vedhika,tdp,ys Jagan,ysrcp

ఏపీ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటగా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అమరావతి లో నిర్మాణమైన ప్రజావేదిక ను కూల్చివేయడం తో పాటు మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ ను కూడా కూల్చివేయాలని చూస్తున్న విషయం తెలిసిందే.

Crda Officials Once Again Issues Notice To Chandrababu Naidu\'s House-crda,once Again Issues Notice To Chandrababu Naidu,praja Vedhika,tdp,ys Jagan,ysrcp-CRDA Officials Once Again Issues Notice To Chandrababu Naidu's House-Crda Once Naidu Praja Vedhika Tdp Ys Jagan Ysrcp

అయితే తాజాగా, మరోసారి చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.నోటీసులు జారీచేసిన అధికారులు వారంలోగా అక్రమ కట్టడాలని తొలగించాలని పేర్కొవడం విశేషం.అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ అక్రమ నిర్మాణాలను కట్టారని,అలంటి వాటిని ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసు జారీచేశామని సీఆర్డీఏ తెలిపింది.

Crda Officials Once Again Issues Notice To Chandrababu Naidu\'s House-crda,once Again Issues Notice To Chandrababu Naidu,praja Vedhika,tdp,ys Jagan,ysrcp-CRDA Officials Once Again Issues Notice To Chandrababu Naidu's House-Crda Once Naidu Praja Vedhika Tdp Ys Jagan Ysrcp

అయితే ఇప్పటికే ఈ కట్టడానికి తగిన అనుమతులు ఉన్నాయని, వీటికి సంబంధించిన పత్రాలను సమర్పిస్తామని చెప్పి నప్పటికీ కూడా నిర్దేశిత గడువులోగా తమకు అందజేయలేదని,కావున ఈ క్రమంలో మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.2014 ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన చంద్రబాబు.కృష్ణా కరకట్టపై ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు.

జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేపట్టారు.కరకట్ట వెంబడి 100 మీటర్లలోపు అక్రమ కట్టడాలను గుర్తించిన సీఆర్డీఏ అధికారులు వారికి కూడా నోటీసులు జారీచేశారు.ఇందులో మంతెన సత్యన్నారాయణ రాజు ఆశ్రమయం, గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్ తదితర కట్టడాలు ఉన్నాయిC