వికేంద్రీకరణ బిల్లు చిన్న ట్విస్ట్‌ ఇచ్చిన చైర్మన్‌ షరీఫ్‌  

Ap Council Chairmen Sharif Comments Decentralization Bill-ap Cm Jagan Mohan Reddy,ap Three Capitals Bill,sharif

జగన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించగా, మండలిలో మాత్రం అది ఆమోదం పొందలేదు.మండలి చైర్మన్‌ షరీఫ్‌ దాన్ని సెలక్షన్‌ కమిటీకి పంపుతున్నట్లుగా ప్రకటించాడు.

Ap Council Chairmen Sharif Comments Decentralization Bill-Ap Cm Jagan Mohan Reddy Ap Three Capitals Bill

దాంతో వికేంద్రీకరణ బిల్లు మద్యలో ఆగిపోయింది.ఈనేపథ్యంలోనే మండలినే రద్దు చేసే యోచనలో జగన్‌ ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే మండలి ఉండాలా వద్దా అనే విషయమై అసెంబ్లీలో చర్చకు అనుమతించాలంటూ జగన్‌ కోరడం జరిగింది.

ఈసమయంలో మండలి చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లు పరిశీలనలో ఉందని, పరిశీలన పూర్తి అయిన తర్వాత సెలక్షన్‌ కమిటీ వద్దకు వెళ్తుందని అన్నాడు.

పరిశీలన అయిన తర్వాత సెలక్షన్‌ కమిటీకి వెళ్తుందా లేదంటే మళ్లీ మండలిలో చర్చకు వస్తుందా అనేది ఆయన తెలియజేయలేదు.కాని మండలి రద్దు వార్తలు వస్తున్న నేపథ్యంలో చైర్మన్‌ షరీఫ్‌ తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అది సాధ్యమా అనేది కొందరు అంటున్నారు.మరి వికేంద్రీకరణ బిల్లు సెలక్షన్‌ కమిటీకి వెళ్లకుండా మళ్లీ సభలోకి వస్తే మాత్రం జగన్‌ విజయం సాధించినట్లే.

తాజా వార్తలు

Ap Council Chairmen Sharif Comments Decentralization Bill-ap Cm Jagan Mohan Reddy,ap Three Capitals Bill,sharif Related....