మండలి చైర్మన్‌ ఆదేశాలకే దిక్కు లేదు  

Ap Council Chairman Sharif Latest Update-ap Governament,bjp Governament,council Secratory,sharif

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో పాస్‌ చేసిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో మెజార్టీ లేని కారణంగా మండలి చైర్మన్‌ షరీఫ్‌ సెలక్షన్‌ కమిటీకి పంపించిన విషయం తెల్సిందే.వైకాపా ప్రభుత్వం ఈ విషయమై చాలా సీరియస్‌గా ఉంది.

AP Council Chairman Sharif Latest Update-Ap Governament Bjp Council Secratory

మండలి రద్దుకోసం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంకు పంపించడం జరిగింది.మండలి రద్దు పక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది.బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది.ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇంకా మండలి అమలులోనే ఉంది.చైర్మన్‌గా షరీఫ్‌ ఇచ్చే ఆదేశాలను శాసన సభ కార్యదర్శి అమలు చేయాల్సి ఉంటుంది.

కాని మండలి చైర్మన్‌ వేసిన సెలక్షన్‌ కమిటీ చెల్లదంటూ సభనసభ కార్యదర్శి ఫైల్‌ను తిప్పి పంపడం ప్రస్తుతం రాజకీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.మండలి చైర్మన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కార్యదర్శిది.

కాని ఆయన విధులను నిర్వర్తించక పోవడంతో ప్రస్తుతం మండలి చైర్మన్‌ ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నాడు.ఇదే సమయంలో వైకాపా ప్రభుత్వం నుండి కూడా కార్యదర్శికి ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజా వార్తలు