ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.... 40 మంది మృతి...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 Ap Latest Corona Update, Andhra Pradesh, Corona Virus, Corona, Ap Updates,-TeluguStop.com

వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కరోనా బాధితుల, మరణాలకు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది.

కొత్తగా నమోదైన కేసుల్లో 2,584 మందికి రాష్ట్రానికి చెందిన వాళ్లు కాగా 9 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లని తెలుస్తోంది.

ప్రభుత్వం గత 24 గంటల్లో 22,304 శాంపిల్స్ ను పరీక్షించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 19,393 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 18,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 590 మంది కరోనా బారిన పడగా తూర్పు గోదావరి జిల్లాలో 500 కేసులు నమోదయ్యాయి.

కొత్తగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుండగా పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చందంగా లాక్ డౌన్ ను పాటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube