ఏపీలో కరోనా కలవరం పెరుగుతున్న కేసులు ? జిల్లాల వారి లెక్కలు ఇవే ?

మొదట్లో ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నట్టు గా కనిపించింది.దీనికి తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వం కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

 Ap Corona Cases Deatiles, Ap Corona Virus, India Lokc Down, Ananthapuram, Chitur-TeluguStop.com

దీంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా కనిపించింది.కానీ అకస్మాత్తుగా ఢిల్లీ మార్కజ్ ప్రార్థనకు వెళ్లొచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఏపీలో మరింత ఉధృతమైంది.

ఈరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.దీంతో ఏపీ ఈ వైరస్ వ్యాప్తి పై అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు ఏపీలో అమలవుతున్నా, ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయినట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటికే జనసంచారం నిరోధించేందుకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే జనాలు రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇచ్చారు.ఇంత పగడ్బంది చర్యలు తీసుకుంటున్నా ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతూ, రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Telugu Ananthapuram, Ap Corona, Chiture, India Lokc, Kadapa, Kurnool, Nellore, P

తాజాగా జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.నిన్న రాత్రి పదిన్నర నుంచి శనివారం ఉదయం 10 గంటల లోపు కొత్తగా నమోదైన కేసుల వివరాలు చూస్తే.కృష్ణాజిల్లాలో 4, కడపలో 4, గుంటూరులో 4, కర్నూలు 3, ప్రకాశం చిత్తూరు జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది.అలాగే కర్నూలు జిల్లాలోని బనగానపల్లి, అవుకుల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.

ఈ విధంగా ఒక్క రాత్రిలోనే 16 కేసులు నమోదు కావడంతో మొత్తం ఈ కేసుల సంఖ్య 190కు చేరింది.నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదవగా, ఆ తరువాతి స్థానంలో కృష్ణాజిల్లా ఉంది.కృష్ణా జిల్లాలో మొత్తం 27 కేసులు నమోదయ్యాయి

Telugu Ananthapuram, Ap Corona, Chiture, India Lokc, Kadapa, Kurnool, Nellore, P

విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.వాస్తవంగా ఈ కరోనా వ్యాధికి గురైన వారిలో ఎక్కువమంది ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారే కావడంతోనే ఏపీలో ఈ పరిస్థితి తలెట్టినట్టుగా కనిపిస్తోంది.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

అనంతపురం 2, చిత్తూరు 10 తూర్పుగోదావరి 11 గుంటూరు 23 కడప 23 కృష్ణ 27 కర్నూలు 4 నెల్లూరు 32 ప్రకాశం 18 విశాఖపట్నం 15 పశ్చిమ గోదావరి 15 గా నమోదైనట్లు ఆరోగ్యశాఖ వివరాలు విడుదల చేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube