సీఎం వల్లే మూడోదశకు చేరుకున్నాం: బుద్దా వెంకన్న  

Ap Corona Virus Ap Cm Jagan Tdp Chandrababu Naidu Tdp Budha Venkanna Ap Lock Down Gunture And Vizag Budha Venkanna And Jagan Budha Venkanna - Telugu Ap Cm Jagan, Ap Corona Virus, Ap Lock Down, Budha Venkanna, Budha Venkanna And Jagan, Gunture And Vizag, Tdp Budha Venkanna, Tdp Chandrababu Naidu

కరోనా నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొంటే ఏపీ సీఎం మాత్రం బ్లీచింగ్ పౌడర్,పారాసిట్మాల్ వాడండి అంటూ సలహాలు ఇచ్చి కాలక్షేపం చేశారు అని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు.జగన్ వల్లే రాష్ట్రంలో కరోనా 3 వ దశకు చేరింది అంటూ విమర్శించారు.

 Ap Corona Virus Ap Cm Jagan Tdp Chandrababu Naidu Tdp Budha Venkanna Ap Lock Down Gunture And Vizag Budha Venkanna And Jagan Budha Venkanna

బ్లీచింగ్ చల్లుకుని పారాసిట్మాల్ వేసుకోమని సెలవిచ్చినందునే ఈ స్థాయిలో చేరుకుంది అని బుద్దా వెంకన్న ఆరోపించారు.పరిపాలన చేతకాదన్నది రాష్ట్ర ప్రజలకు జగన్ చర్యలతో తేటతెల్లమైందని,లాక్‌డౌన్ ఆంక్షలను వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఏమాత్రం పాటించడం లేదని బుద్దా వెంకన్న విమర్శించారు.

మంత్రి సురేష్‌తో పాటు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు లాక్‌డౌన్‌ని ఉల్లంఘిస్తే వారిని ఎందుకు క్వారంటైన్‌లో పెట్టలేదని ప్రశ్నించారు.రాష్ట్రం మంచి కోసం ఈ సూచనలు పాటించండని చంద్రబాబు లేఖలు రాస్తుంటే దానినీ వైసీపీ నేతలు తప్పుబట్టడం దురదృష్టకరమని ఈ సందర్భంగా బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

సీఎం వల్లే మూడోదశకు చేరుకున్నాం: బుద్దా వెంకన్న-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలానే లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు అందిస్తున్న వెయ్యి రూపాయలతో వారు ఎలా బతుకుతారు అంటూ ప్రశ్నించారు.ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ వెంకన్న మండిపడ్డారు.

సంక్షోభ సమయంలోనూ సాక్షి పత్రికకు జగన్ కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 365 కు చేరుకోగా,వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అలానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు కరోనా కు బలయ్యారు.అయితే గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా టెస్టులలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.

అయితే గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు కొంచం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..