ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు కోవిడ్-19 పేషంట్లకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఏపీ రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.ఏకంగా 10 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి.
దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా పేషంట్ల కోసం అరగంటలోనే బెడ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
దీనికి సంబంధించిన బాధ్యతలును కలెక్టర్లు, జేసీలకు అప్పగించారు.ఇక కోవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నవారి నుంచి ఆహారంపై తరచూ విమర్శలు వస్తున్నాయి.
అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో మంచి పౌష్టికాహారం కలిగి ఉన్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు.
కోవిడ్ పేషంట్లకు సంబంధించిన ఫుడ్ మెనును మార్చింది ప్రభుత్వం.తాజాగా స్పెషల్ మెనుతో ముందుకు వచ్చింది.మెను వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రోజూ ఉదయం బ్రెక్ ఫాస్ట్ లో రాగిజావ, బెల్లం, పాలను అందిస్తుండగా.రోజుకో టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంలో వివిధ వెరైటీలు అందించనుంది.
సోమ నుంచి ఆదివారం వరకు మెనూలో మార్పు చేస్తుంది.ఫుడ్ మెనూకు సంబంధించిన వివరాలను ఆరోగ్య ఆంధ్ర పేరుతో ట్వీటర్ లో ట్వీట్ చేశారు.
కాగా, మెనూ సంబంధించి మార్పులు వైద్యుల సూచనల మేరకు మార్చవచ్చు.