ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి.. తీవ్ర రూపం దాల్చిన వైరస్.. !

గత సంవత్సరం భారతీయుల పై అంతగా ప్రభావం చూపని కరోనా తన బలాన్ని పుంజుకుని సెకండ్ వేవ్‌గా దేశంలోకి ప్రవేశించి కల్లోలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ఉదృతికి ప్రభుత్వాలే అల్లాడుతున్నాయి.

 Corona Cases Increased In Ap, Andra Pradesh, Corona, New Uppdets, 10thousand, Co-TeluguStop.com

ఇకపోతే ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది.ఈ క్రమంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య కొత్త రికార్డు సృష్టిస్తోంది.

ఈ నేపధ్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.వీరి లెక్కల ప్రకారం.

గడచిన 24గంటల్లో ఏపీలో 8,987 కరోనా కేసులు వెలుగు చూడగా, 35 మంది చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వెల్లడించారు.ఇకపోతే టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఇక ఇక్కడి జిల్లాల వారీగా కోవిడ్ కేసుల సంఖ్యను చూస్తే.శ్రీకాకుళం 1,344, గుంటూరులో 1,202 కేసులు, నెల్లూరు 1,347, చిత్తూరు 1,063, తూర్పుగోదావరి 851, కర్నూలు 758, విశాఖలో 675 కేసులు, ప్రకాశం 305, కడప 297, కృష్ణా 441, విజయనగరం 380, అనంతపురం 275 కేసులు వెలుగుచూశాయని పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube