ఏపీలో కరోనా టెన్షన్ ? కొత్త కేసులతో మరింత ఆందోళన ?

కరోనా వైరస్ విషయంలో ఏపీలో మొదట్లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నట్టు గా కనిపించినా, ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.మొదట్లో మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులో ఉన్నట్లు కనిపించింది.

 Coronavirus, Ap, Jagan, Lockdown, Cm Jagan, Nellore-TeluguStop.com

అయితే మూడు, నాలుగు రోజుల నుంచి ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి.తాజాగా ఈరోజు కొత్తగా 34 కేసులు పెరిగినట్లుగా వైద్య శాఖ అధికారులు లెక్కలు తేల్చారు.

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల సమయానికి కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి.రోజురోజుకు ఈ విధంగా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

మొత్తంగా ఇప్పటి వరకు ఏపీలో 226 కేసులు నమోదయ్యాయి.
ఏపీ మొత్తం ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

కొత్తగా కర్నూలు జిల్లాలో 23 , నెల్లూరులో రెండు, ఒంగోలులో రెండు, చిత్తూరులో ఏడు కేసులు నమోదయ్యాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

ఏపీలో అన్ని జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది.వాస్తవంగా ఏపీలో ఈ వైరస్ వ్యాప్తి మొదట్లో కాస్త అదుపులో ఉన్నట్లు గానే కనిపించింది.

అయితే అకస్మాత్తుగా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 90 మందికి కరోనా వైరస్ వచ్చింది.

దీంతో వారిని, వారితో పాటు వారి కుటుంబ సభ్యులను, వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి ఐసోలేషన్ కేంద్రంలో ఉంచారు.

Telugu Cm Jagan, Coronavirus, Jagan, Lockdown, Nellore-Political

వారికి పూర్తిస్థాయిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా, కొత్తగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో పరిస్థితి కనుక పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోతే, మరి కొంతకాలం పాటు లాక్ డౌన్ నిబంధనలను పొడిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ పరిస్థితి అదుపు తప్పడంతో సీఎం జగన్ రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేస్తున్నారు.లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలనీ, ప్రజల సంచారం రోడ్లపై లేకుండా చూడాలంటూ పోలీస్ శాఖను ఏడిసించినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube