వైసీపీని భయపెడుతున్న కాంగ్రెస్ ... మరీ ఇంతగానా...?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నర్ధకం అయ్యింది.పోనీ తెలంగాణలో ఆ పార్టీ ఏమైనా పుంజుకుందా అంటే… అదీ లేదు.

 Ap Congress Putting In Tension To Ycp-TeluguStop.com

అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎంత ఉందో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనే స్పష్టం అయ్యింది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే మొదట తెలంగాణలో టీడీపీతో పాటు మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లినా… చేదు ఫలితాలు చవిచూడడంతో…ఇప్పుడు ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ దోస్తీ పై అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి.అయితే… అటు కాంగ్రెస్ – టీడీపీ కూడా… ఈ విషయంలో ఏపీలో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తాయి తప్ప కలిసి పోటీ చేసే ఛాన్స్ లేదని తేల్చేశాయి.అయితే కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగడంపై వైసీపీ ఆందోళన చెందుతోంది.

కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే….తమ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొల్లగొడుతుందని అంచనా వేస్తూ కలవరం చెందుతున్నారు.అయితే… ఏ మేరకు ఓట్లు చీలుతాయోనని లెక్కలు వేస్తున్నారట.ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ గతంలో కాంగ్రెస్ పార్టీది కావడమే ఇంత ఆందోళన చెందడానికి కారణం.2014 ఎన్నికల్లో ఏపీలో చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.ఇదే సమయంలో వైసీపీకి కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ బదిలీ అయింది.దాని ప్రభావంతో… గత ఎన్నికల్లో టీడీపీతో ధీటుగా వైసీపీ పోరాడగలిగింది.

ఒక దశలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు కూడా కొందరు వేశారు.అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

టీడీపీ, బీజేపీ స్నేహ బంధం పూర్తిగా చెడిపోయింది.తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు.ఈ తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు వ్యూహం మార్చారు.కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు.ఇప్పటి వరకు ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ- కాంగ్రెస్‌ పార్టీల పొత్తు కొనసాగుతుందనీ, అదే జరిగితే తాము బాగా లాభపడతామనీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తూ వచ్చారు.

కానీ ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ప్రకటించింది.దీంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.కాంగ్రెస్ పార్టీ కనుక ఏపీలో పుంజుకునే ప్రయత్నం చేస్తే తమకు చేటేనని… అప్పట్లో పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి మేలు జరిగి తమకు అధికారం దక్కకుండా పోయిందని… ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో… తమ ఆశలు గల్లంతు చేస్తుంది అని భయపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube