అయ్యయ్యో: కరెంటు లేకపోతే కార్తీకదీపం సీరియల్ ఎలా చూడాలంటున్న ఏపీ కాంగ్రెస్‌ నేత..!

ఏపీలో ప్రభుత్వ పాలన ఏమాత్రం బాగోలేదని ఏపీ కాంగ్రస్ నేత చింతా మోహన్ విమర్శల వర్షం కురిపించారు.ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ఏ మాత్రం బాగోలేదని ఎద్దేవా చేసారు.

 Ap Congress Leader Chinta Mohan Satires On Jagan Government Over Current Scarcity-TeluguStop.com

అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నవరత్నాలు కావని అవన్నీ నవరంధ్రాలు అని కొత్త పేరు పెట్టారు కాంగ్రెస్ నేత.అక్కడితో ఆగకుండా సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి ఒక్కరు విద్యుత్ వినియోగం తగ్గించాలని అధికార పక్ష నాయకులు అంటున్నారని, అలా గాని జరిగితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమయిపోతారు అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఆ సమయంలో ప్రతి ఒక్కరి ఇళ్లల్లో మహిళలంతా కార్తీక దీపం సీరియల్‌ చూసే పనిలో ఉంటారు.

సరిగ్గా ఆ సమయంలోనే విద్యుత్ ఆదా చేయాలంటే మహిళలు ఎలా కార్తీక దీపం సీరియల్ చూడాలి అంటూ సెటైర్లు వేశారు ఏపీ కాంగ్రెస్‌ నేత చింతామోహన్‌.

 Ap Congress Leader Chinta Mohan Satires On Jagan Government Over Current Scarcity-అయ్యయ్యో: కరెంటు లేకపోతే కార్తీకదీపం సీరియల్ ఎలా చూడాలంటున్న ఏపీ కాంగ్రెస్‌ నేత..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఇతర సదుపాయాలు సరిగా అందడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చింతా మోహన్ ఓ రేంజ్ లో భారీ డైలాగ్‌ లు పేల్చారు.విద్యార్థులకు అండగా ఉంటానన్న జగన్ మోహన్ రెడ్డి వారి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఏమి చేసింది చెప్పాలన్నారు.

Telugu Ap Congress Leader Chinta Mohan, Congress Leader, Current, Current Scarcity, Karthika Deepam, Power Cut, Satires On Jagan Government, Serial, Shocking Comments-Latest News - Telugu

ప్రస్తుతం బొగ్గు కొరతతో ఉన్న ఏపీ రానున్న రోజుల్లో అంధకారంలోకి వెళ్లబోతుందని సూచనలు చేసారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజధాని రైతులకోసం పోరాటం చేస్తుందని, వారికి మద్దతుగా ఉండడానికీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సైతం అమరావతికి తీసుకువస్తున్నామంటూ ఆయన తెలిపారు.రాజధాని మహిళా రైతులు కార్చే కన్నీరే ఈ ప్రభుత్వ సర్వనాశనంకు కారణం అవుతుందని విమర్శలు చేసారు.

నిజంగానే రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు విద్యుత్ వినియోగం ఆపేస్తే ఏపీ రాష్ట్రంలోని మహిళలు ఏమయిపోతారో కదా.

#Jagan #CongressChinta #Scarcity #Congress #Karthika Deepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు