ఓ వైపు కరోనా మరోవైపు జగన్ వార్నింగ్ ? మంత్రులకు ఎన్ని కష్టాలో ?

ఏపీలో ఒకవైపు కరోనా వైరస్ ప్రభావం, మరోవైపు జగన్ వార్నింగ్ లు ఇలా అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టడంతో ఏపీ మంత్రులు తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఇప్పటికే పనితీరు బాగాలేని మంత్రులను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించేది లేదని, వెంటనే వారిని తప్పించేందుకు వెనుకాడనని ఇప్పటికే జగన్ ప్రకటించారు.

 Ap Cm Ys Jagan, Warning Ministers, Corona, Elections-TeluguStop.com

ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుపై నివేదికలు తప్పించుకుంటున్న జగన్ పనితీరు బాగాలేని మంత్రులను తప్పించి ఆ స్థానంలో వేరే వారికి అవకాశం కల్పిస్తామంటూ పదే పదే చెబుతున్నారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రి వర్గంలో ఎవరెవరిని కొనసాగించాలి, ఎవరిని తప్పించాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం అంటూ ఇప్పటికే జగన్ మంత్రులకు సిగ్నల్స్ పంపించారు.

దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం అని భావిస్తున్న తరుణంలో అనుకోకుండా కరోనా వైరస్ ప్రభావం ఏపీ పై పడడంతో ఎన్నికలు వాయిదా పడడంతో పాటు మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో మునిగిపోయింది.

ఏపీలో ఓ ఐదారుగురు మంత్రులు మినహా, మిగిలిన వారంతా తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు.

తమ జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముఖ్యమైన నాయకులతో సమావేశమవుతు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కే విషయంపై పూర్తి స్థాయిలో మంత్రుల దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.కరోనా వైరస్ ప్రభావం ఏపీపై ఎక్కువ ఉండడంతో ఇది కొద్దిరోజుల్లో ఎలాగూ ముగుస్తుంది కాబట్టి, ఆ తర్వాత ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో, ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో మంత్రులు ప్రచారంపై దృష్టి పెట్టారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం సహాయం అందిస్తున్న తరుణంలో, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే విధంగా చేసుకునే విషయంపై మంత్రులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Telugu Ap Cm Ys Jagan, Corona, Ministers-Telugu Political News

ఒకవేళ ఆ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోతే తమకు మంత్రి పదవులు పోతాయని మంత్రులంతా టెన్షన్ లో ఉన్నారు.ఇప్పటికే, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మంత్రులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.పనిలో పనిగా జనాల్లో తిరుగుతూ కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వం అందించే సహాయం ప్రజలకు అందేలా చూస్తూ తమ పలుకుబడి పెంచునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube