పేదలు వర్సెస్ పెద్దలు ! జగన్ సక్సెస్ అయినట్టేనా ?

తమను ప్రతి విషయంలోనూ తప్పుపడుతూ,  ప్రజల్లో చులకన చేసేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు( TDP Chief Chandrababu Naidu )ను అంతకంటే ఎక్కువ స్థాయిలో దెబ్బతీయడంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై చేయి సాడించినట్టే కనిపిస్తున్నారు.అమరావతి విషయంలో టిడిపి మొదటి నుంచి  హడావుడి చేస్తోంది.

 Ap Cm Ys Jagan Mohan To Distribute House-site Pattas In Amaravati,amaravati,hous-TeluguStop.com

అమరావతిలోనే ఏపీ రాజధాని( AP Capital )ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు తెరతీసింది.అమరావతి అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకుని 2024 ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టాలనే వ్యూహాన్ని పన్నుతోంది.

అయితే ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అమరావతి ప్రాంతంలో వైసీపీకి తిరుగులేకుండా చేసుకునేందుకు వేసిన ప్లాన్ లు అన్ని వర్క్ అవుట్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి.

Telugu Amaravati, Ap, Ap Cm Ys Jagan, Chandrababu, Site Pattas-Politics

2019 ఎన్నికల్లోను అమరావతి( Amaravati ) ప్రాంతంలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గలను వైసీపీ గెలుచుకుంది.ఈసారి మంగళగిరి నుంచి మళ్లీ లోకేష్ పోటీ చేయబోతున్నారు.దీంతో మంగళగిరి, తాడికొండ నియోజకవర్గల్లో వైసీపీ( YCP ) కి తిరుగులేకుండా చేసుకునేందుకు , అమరావతి వ్యవహారంలో టిడిపి దూకుడుకు కళ్లెం వేసేందుకు జగన్ ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 142 ఎకరాల్లో 25 లేఔట్లలో 50, 793 నిరుపేద కుటుంబాలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు.దీనిని అడ్డుకునేందుకు అమరావతి రైతుల పేరుతో తెరవెనుక టిడిపి( TDP ) గట్టి ప్రయత్నాలు చేసింది.

హైకోర్టు ,సుప్రీంకోర్టులోను పిటిషన్ వేసింది.అయినా ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు రావడంతో అక్కడ జగన్ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపట్టారు.

అంతేకాదు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టిడిపి దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిందని, టిడిపి సంపన్నుల పక్షమేనని, వైసిపి పేదల పక్షపాతి అని ప్రచారం చేసుకుని, ఆ భావన జనాల్లో కలిగించడంలో వైసిపి సక్సెస్ అయింది.

Telugu Amaravati, Ap, Ap Cm Ys Jagan, Chandrababu, Site Pattas-Politics

 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జగన్ ఇదే అంశంపై మాట్లాడారు.’ దేశంలో ఎక్కడైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూసాం , రాష్ట్రంలో మాత్రం ఇవ్వద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాలను చూస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే తట్టుకోలేక గజదొంగల ముఠా అడ్డుపడుతోంది.ఈ మారేచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా,  సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసి మరి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తున్నాం.’ రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదు.ఇక్కడ జరుగుతోంది క్లాస్ వార్.ఒకవైపు పేదవాడు ఉంటే మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందారులు ఏకమై యుద్ధం చేస్తున్నారు.పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకు వెళ్లి అడ్డుకుంటున్నారు.ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించారు అంటే, పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే, పెత్తందారులు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు.

అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.అక్కడ ఓడిపోయిన ఇప్పటికీ చంద్రబాబు ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉన్నారు’ అంటూ జగన్ చేసిన ప్రసంగం హైలెట్ కావడంతో టిడిపి ఈ విషయంలో  ఢీలా పడిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube