కాపుల రిజర్వేషన్ తూచ్ అనేసిన జగన్

ఏపీ రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రోజుకొక నిర్ణయంతో సంచలనంగా మారుతున్న జగన్.వరుసగా తాను అమలు చేస్తానని చెప్పిన నవరత్నాలు అన్ని కూడా చట్టబద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

 Ap Cm Ys Jagan Mohan Reddy Government Sensational Decision On Ebc Kapu Reservat-TeluguStop.com

అయితే వీటిలో దేనికి నిధులు విడుదల చేయకపోయినా జీవోలు మాత్రం తీసుకొస్తున్నారు.ఇక పనిలో పనిగా గ్రామ సచివాలయాలలో ఏకంగా లక్షకు పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

సెప్టెంబర్ నాటికి వారి నియామకం కూడా జరిగిపోయే విధంగా ప్రణాళిక వేసుకున్నాడు.

ఇదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా చేసిన సంక్షేమ పథకాలు, జీవోలకి మంగళం పడేస్తున్నాడు.

ఇప్పటికే అన్నా క్యాంటీన్ లకి, నిరుద్యోగ భ్రుతికి మంగళం పాడేసిన జగన్ తాజాగా టీడీపీ కాపుల రిజర్వేషన్ అంటూ కాలయాపన చేసి ఎన్నికల ముందు ఈబీసీ కోటాలో ఐదు శాతం కాపులకి రిజర్వేషన్ ఇస్తున్నట్లు హడావిడి జీవో రిలీజ్ చేసింది.అయితే జగన్ ఈ జీవోని రద్దు చేస్తూ కాపులకి ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదని తేల్చి చెప్పేసాడు.

ఎన్నికల ముందు బహిరంగ సభలో కాపులకి రిజర్వేషన్ సాద్యం కాదు అని చెప్పినట్లు గానే ఉన్న ఈబీసీ రిజర్వేషన్ కూడా జగన్ తొలగించేసాడు.దీనిపై టీడీపీలో ఉన్న కాపు నేతలు ఉద్యమాలు చేస్తాం అంటూ హడావిడి చేస్తున్నారు.

మరి దీనిపై కాపు ఉద్యమ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube