జగన్ కు మోదీ సాయం ? బంధం బలపడినట్టేగా ?

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటుందో ? ఎవరితో విరోధం వస్తుందో చెప్పలేము.రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి.

 Ys Jagan, Narendra Modi, Video Conference, Corona, Help-TeluguStop.com

ఏపీ సీఎం జగన్ విషయానికొస్తే రాజకీయంగా జగన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.రాజకీయ ప్రత్యర్థులు అంతా కలిసి జగన్ పై విమర్శల బాణాలు వదులుతూ రాజకీయంగా అణగదొక్కలని ప్రయత్నిస్తున్నారు.

అయినా జగన్ మాత్రం తన శక్తివంచన మేరకు పరిపాలన కొనసాగిస్తూ ప్రజల్లో పలుకుబడి తగ్గకుండా చూసుకుంటున్నారు.ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చిన పది నెలల సమయంలోనే చేసి చూపించి సరికొత్త రికార్డులన జగన్ సృష్టించారు.

ఈ సందర్భంగా తన పరిపాలనపై, తన నిర్ణయాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా జగన్ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పుడిప్పుడే పరిపాలన ఒక గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకులు పడిపోయింది.

మార్చి 25వ తేదీ నుంచి లాక్ నిబంధన కొనసాగుతుండడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత జరిగింది.దీనికితోడు ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వారికి ఇప్పటికే నిత్యావసరాలు, ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు జగన్.

ఇంత వరకు బాగానే ఉన్నా, జగన్ పై ఏదో రకంగా బురద చల్లేందుకు టిడిపి, ఏపీ బిజెపి నాయకులు, జనసేన పార్టీ ప్రయత్నిస్తోంది.ఈ తరుణంలో జగన్ కు సహాయ సహకారాలు అందిస్తానని స్వయంగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగారు.

అసలు లాక్ డౌన్ కు రెండు రోజులు ముందుగానే 14వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేశారు.మొదటి విడతలో భాగంగా 1300 కోట్ల రూపాయలను విడుదల చేశారు.

Telugu Corona, Narendra Modi, Conference, Ys Jagan-Telugu Political News

వాస్తవంగా అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఈ నిధులు విడుదల కావాల్సి ఉన్నా, ఏపీకి జగన్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిధులను విడుదల చేశారు.అలాగే కరోనా సహాయం కింద ఏపీకి మరో 1100 కోట్లు విడుదల చేశారు.తాజాగా ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఏపీ ఆర్థిక పరిస్థితిని గురించి ఆరా తీయడమే కాకుండా, ఆ తర్వాత ఏపీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో జగన్ లో ఉత్సాహం కనిపిస్తున్నట్లు వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.ఒకవైపు ఏపీలో జగన్ పై రాజకీయ ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి జగన్ కు అండగా నిలబడుతు, నిధులు విడుదల చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.ఏపీకి సంబంధించి అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ సహకారం లభిస్తుండడం పెద్ద ఉపశమనం గానే కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube