ఆ సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వను.. జగన్ తీర్మానం.. ?

ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమాన్నే పట్టించుకోని కేంద్రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కఠినంగా వ్యవహరించదనే నమ్మకం లేదు.అయినా గానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మిక సంఘాలు పూర్తి భారాన్ని జగన్ మీద వేసినట్లున్నాయి.

 Ys Jagan Decided Against Posco Company For Vizag Steel Plant, Ys Jagan, Key Deci-TeluguStop.com

ఈ క్రమంలో వైఎస్ జగన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన నేపధ్యంలో, ఈ సంస్దను ప్రైవేటు పరం కానివ్వనని, అలా అయ్యే అవకాశాలు లేవని తమతో అన్నారని ప్లాంట్ కు చెందిన కార్మిక సంఘాల నేతలు తెలియచేస్తున్నారు.

ఇకపోతే విశాఖకు వెళ్లిన జగన్ ను కొందరు నేతలు ఎయిర్ పోర్టులో కలిసి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారట.

కాగా ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని జగన్ తమతో అన్నారని వారు వెల్లడించారు.

Telugu Central, Key, Posco, Vizag, Vizag Steel, Ys Jagan-Latest News - Telugu

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మనస్సు మార్చుకుని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని కార్మిక నేతలు తెలియచేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube