బాబు ధర్మ పోరాట దీక్షకి మద్దతుగా సంఘీభావం తెలిపిన మాజీ ప్రధాని!  

ఏపీ విభజన హామీలని అమలు చేయకుండా తెలుగు ప్రజలని మోసం చేయడానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షకి మద్దతుగా విపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధర్మ పోరాట దీక్ష వేదికకి వచ్చి నిరసనకి సంఘీభావం తెలియజేసారు. ఇక తాజాగా మాజీ ప్రధా మన్మోహన్ సింగ్ కూడా దీక్షాస్థలికి చేరుకొని చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలియజేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రజలకి ఇచ్చిన విభజన హామీలని అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో అసలు తెలుగు ప్రజలని భారతీయులుగా మోడీ చూస్తున్నారా అనే అనుమానం కలుగుతుందని ఘాటుగా విమర్శలు చేశారు. ఇక మన్మోహన్ సింగ్ కూడా ఏపీ ప్రజలని ఆడుకొని, తక్షణం విభజన హామీలు అమలు చేయడంతో పాటు, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, దీనికి ఏఐసిసి పూర్తి మద్దతుగా నిలబడుతుంది అని హామీ ఇచ్చారు. ఢిల్లీ వేదికగాజరుగుతున్న ఈ ధర్మ పోరాట దీక్షని విపక్ష పార్టీల నుంచి ఇంకెంత మంది మద్దతుగా నిలుస్తారు అనేది వేచి చూడాలి.