డేటా చోరీపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటుకి నిర్ణయం! అసలేం జరుగుతుంది!

ఏపీలో ఓటర్ల డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలలో రెండు రాష్ట్రాల మధ్య, అలాగే ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో తారాస్థాయికి చేరింది.ఓ వైపు ఈ డేటా చోరీ వ్యవహారంలో ఏపీలో అధికార పార్టీ టీడీపీని కార్నర్ చేసే విధంగా తెలంగాణ పోలీసులు విచారణ చేసి ఇప్పుడు ఆ ఆధారాలతో సిట్ విచారణకి ఆదేశించింది.

 Ap Cm Planting Sit Inquiry On Data Theft Case-TeluguStop.com

అయితే ఏపీ వ్యవహారాలలో తెలంగాణ సర్కార్ చేతులు పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు.ఇదిలా వుంటే డేటా చోరీకి పాల్పడింది వైసీపీ అని, స్వయంగా జగన్ ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు.

దీనిని అవకాశంగా తీసుకున్న టీడీపీ ఇప్పుడు వైసీపీ పార్టీ తమకి అనుకూలంగా వున్న 8 లక్షల ఓట్లు తొలగించే కుట్రకి ప్రయత్నం చేసింది అని.ప్రభుత్వం డేటా చోరీ చేసి తెలంగాణ సర్కార్ గా ఈ ఓట్ల తొలగింపు కుట్రకి తెరతీసింది అని ఆరోపణలు చేసింది.అంతటితో ఆగకుండా నిన్న గుంటూరు రూరల్ ఎస్పీకి ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఫిర్యాదు చేసింది.మరో వైపు డేటా చోరీ అందులో వైసీపీ పాత్ర తేల్చేందుకు టీడీపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరి దీనిపై రెండు రాష్ట్రాల సిట్ విచారణ బృందాలు ఎలాంటి సమాచారం రిలీజ్ చేస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube