ఆరో తేదీన ఏం జరగబోతోంది ? జగన్ మోదీ ఏం మాట్లాడుకోబోతున్నారు ?

ఈనెల ఆరో తేదీన ఏపీ కి సంబంధించి ఎన్నో అంశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అలాగే మరెన్నో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

 Ap Cm Jgan Meet On Prime Minister Modhi Date Is Fixed,kcr ,ktr ,telangana ,-TeluguStop.com

ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకడంతో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.ఈ మేరకు సోమవారం ఉదయం జగన్ అమరావతి నుంచి పులివెందుల చేరుకుని అక్కడ జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి 3: 15 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.ఆరో తేదీన ఏపీ, తెలంగాణాకు సంబంధించి జల వివాదాలపై జరగబోయే అపెక్స్ కమిటీ భేటీ ఉన్న నేపథ్యంలో, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

అనంతరం జగన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే కేంద్రానికి అన్ని రకాలుగానూ జగన్ సహాయం అందిస్తున్నారు.పార్లమెంట్, రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లులపై ఎన్డీఏ లోని మిత్రపక్షాల ముఖం చాటేస్తున్న సమయంలోనూ ఏపీ సీఎం జగన్ మాత్రం అన్ని విధాలుగానూ కేంద్రానికి మద్దతు తెలుపుతూ, అండగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ భేటీ కావడం, ఈ సందర్భంగా వైసీపీని ఎన్డీఏలో చేరాల్సిందిగా కోరడంతో పాటు, కేంద్ర మంత్రివర్గంలో రెండు క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ప్రధాని తో జగన్ భేటీ సందర్భంగా అనేక అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ఏపీ కి సంబంధించి నిధుల విడుదల అంశంపైన జగన్ చర్చించబోతున్నారట.పనిలో పనిగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై సిబిఐ విచారణ చేయించే అంశాన్ని సైతం జగన్ ప్రస్తావించి క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో పాటు ఏపీ కి సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టుల అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉందట.మొత్తానికి ప్రధాని మోదీ తో జగన్ భేటీ అనంతరం తీపి కబురుతోనే జగన్ ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇక అదే ఆరో తేదీన అపెక్స్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఏపీకి సంబంధించిన వివాదాలను కేంద్రం ఏ విధంగా పరిష్కరిస్తుంది ? ఎవరివైపు అండగా నిలబడుతుంది అనే విషయాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.బిజెపికి దగ్గర జగన్ కేసీఆర్ అదేపనిగా కేంద్రాన్ని విమర్శిస్తూ ఉండడం వంటి పరిణామాలతో అపెక్స్ కమిటీ సమావేశం పైన ఇప్పుడు ఉత్కంట నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube