జగన్ కు వెన్నుపోటు పొడిచిన వారిపై వేటు తప్పదా ?

ఏపీ

అధికార పార్టీ వైసీపీలో అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నా, కొంత మంది పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరి కారణంగా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వారు పార్టీకి,

జగన్

కు వెన్నుపోటు పొడవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

 Jagan Angry On Some Ycp Party Ministers And Leaders Ap, Ap Cm Jagan, Ycp, Corona-TeluguStop.com

అయితే వారిపై కఠిన నిర్ణయం తీసుకునేందుకు జగన్ సిద్ధమైనా

కరోనా వైరస్

తీవ్రస్థాయిలో విజృంభించడంతో జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితులు అన్ని చక్కబడిన తరువాత ఆ వెన్నుపోటు వీరుల పై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వారు చాలామంది ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు జగన్ సముచిత స్థానం ఇస్తారని భావించారు.

తమకు ఎమ్మెల్సీ గా అవకాశం కానీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల గాని ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.

కానీ

నామినేటెడ్ పోస్టులు

విషయంలోనూ జగన్ సామాజిక న్యాయం పేరుతో వేరే వారికి పదవులు కట్టబెట్టడం పైన వీరంతా గుర్రుగా ఉన్నారు.ఇటువంటి నాయకులంతా కలిసి ఇప్పుడు పార్టీకి కి వెన్నుపోటు పొడుస్తూ రాజకీయ ప్రత్యర్ధులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తుండడంతో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలనే తీసుకుంటే ఈ ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ స్థానాలు తీసుకువచ్చే విధంగా చేయాలని గట్టిగా చెప్పినా వారు మాత్రం జగన్ మాటలు కూడా పట్టించుకోలేదు అనే రిపోర్టులు అందాయి.

Telugu Ap Cm Jagan, Ap, Corona, Jagan, Ycp-Political

కడప, నెల్లూరు, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ నాయకులు

పార్టీకి వ్యతిరేకంగా చాలా మంది పని చేశారని, గెలుస్తాము అనుకున్న చోట కూడా పార్టీ ఓటమి చెందడాన్ని ఇప్పటికీ జగన్ సహించలేకపోతున్నారు.ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన

ఓ మంత్రి పై జగన్

చాలా కాలం నుంచి ఆగ్రహంగా ఉన్నారు.సదరు మంత్రి వ్యవహారశైలి తరచుగా వివాదాస్పదం అవ్వడం, సొంత పార్టీ నాయకుల విషయంలో పక్షపాతం చూపించడం, రెండు ఎంపిటిసి స్థానాలను ఏకగ్రీవంగా

జనసేన

కు వెళ్ళే విధంగా సదరు మంత్రి వ్యవహరించిన తీరు పైన జగన్ కు నివేదికలు అందాయి.

అలాగే అదే డెల్టా ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీ అభ్యర్థులు గెలవకుండా ఉండేలా తన అనుచరులకు సూచనలు చేయడం, వారి ఓటమికి కృషి చేయాలి అంటూ చెప్పడం వంటి విషయాలు జగన్ వరకు వెళ్లడంతో ఈ కరోనా హడావుడి ముగియగానే వారందరి పైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అలాగే మొదటి నుంచి పార్టీకి నష్టం చేకూరుస్తు వస్తున్న మంత్రిని కూడా తప్పిస్తారు అనే ప్రచారం ఊపందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube