మీడియాకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసాడు.ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత జగన్ మొదటిగా వృద్ధాప్య పించన్ మీద మొదటి సంతకం చేసాడు.

 Ap Cm Jagan Warns To Media In First Speech-TeluguStop.com

ఇక ముఖ్యమంత్రి హోదాలో మొదటిగా ప్రసంగించిన జగన్ కీలక ఉపన్యాసం చేసాడు.తనకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకి కృతజ్ఞత కలిగి ఉంటానని చెప్పిన జగన్ ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పుకొచ్చారు.

తన పాదయాత్రలో ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలని తెలుసుకున్న అని ఇక తన పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తా అని, వ్యవస్థని ప్రక్షాళన చేసి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా అని చెప్పుకొచ్చారు.

ఇదే సందర్భంగా ఊహించని విధంగా జగన్ మీడియాని కూడా టార్గెట్లా చేసి మాట్లాడటం విశేషం.

తాను నిస్పక్షపాతంగా పరిపాలన అదించడంతో పాటు, ప్రతి పనిలో పారదర్శకత ఉండే విధంగా చూస్తానని, అలా కాకుండా ఎల్లో మీడియా దురుద్దేశ్యంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మీద చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తే సహించేది లేదని స్పష్టం చేసారు.ప్రభుత్వ పథకాలలో లోటుపాట్లు ఉంటే చెప్పాలి కాని ఇష్టానుసారంగా రాతలు రాస్తామంటే కచ్చితంగా పరువునష్టం దావా వేస్తామన్నారు.

ప్రభుత్వ పథకాలు కులం, మతం, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తామని ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నానని జగన్ చెప్పుకొచ్చారు.గతంలో తనమీద విషం కక్కినట్టు కొత్త ప్రభుత్వంపై విషం కక్కితే సహించబోనని జగన్ బాహాటంగా ఆగ్రహంగా చెప్పినట్టు అర్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube