విన్నపాలు చేసినా విమర్శలు తప్పట్లేదే ! బీజేపీ పెద్దలపై జగన్ గుర్రు  

Ap Cm Jagan Want To Meet Amit Shah - Telugu Amit Shah Appointment, Ap Cm Jagan, Bjp Leaders Comments, Central Govt, Polavaram, Tdp Leaders

వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంతో సఖ్యత పాటించేందుకు తాపత్రయపడుతున్నాడు.తాను ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ ఆ పథకాల అమలు చేసేందుకు నిధుల కోసం కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు.

Ap Cm Jagan Want To Meet Amit Shah

అయితే బీజేపీ జగన్ విషయంలో చిన్న చూపు చూసినా జగన్ మాత్రం కేంద్రంతో వైరం పెట్టుకోకూడదు అనే ఆలోచనలోనే ఉన్నాడు.తాను పలుమార్లు ఢిల్లీ వెళ్లి మోదీతో సహా పెద్దలందరినీ కలసి ఎన్నో విన్నపాలు చేసుకున్నా కేంద్ర సహాయం అంతంత మాత్రంగానే ఉండడంతో పాటు తిరిగి తన మీదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జగన్ లో లోపల ఆగ్రహం చెందుతున్నట్టు ఆయనకు అత్యంత సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ఆంధ్ర – తెలంగాణ విడిపోయిన తరువాత ఏపీ అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయిందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామని కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉందని, దీనికి తోడు రాజకీయంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని వైసీపీ హై కమాండ్ మండిపడుతోంది.ఇది ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మైలేజ్ పెంచే కార్యక్రమం అని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

విన్నపాలు చేసినా విమర్శలు తప్పట్లేదే బీజేపీ పెద్దలపై జగన్ గుర్రు-Political-Telugu Tollywood Photo Image

ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధానికి విన్నవించుకున్నా పరిస్థితి ఏ మాత్రం మారలేదని, దీంతో బీజేపీ చీఫ్ అమిత్ షాకు తన బాధలన్నీ చెప్పుకుందామంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడంలేదని జగన్ లోలోపల ఆవేదన చెంతున్నాడట.అయితే అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తరువాత రొజు నుంచి ఢిల్లీలోనే ఉంటున్నారు.

అందరు పెద్దలూ ఆయన్ని కలుస్తున్నారు.మరి జగన్ మాత్రం మళ్ళీ కలిసేందుకు ప్రయత్నించడం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.

జగన్ ఢిల్లీ టూర్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ని కూడా కలవాల్సి ఉంది.అయితే జగన్ టూర్ అనూహ్యంగా క్యాన్సిల్ అయింది.అయితే ఇదే సమయంలో ఏపీ బీజేపీ టీమ్ మాత్రం షెకావత్ ని కలిసింది.అయితే ఆ సందర్భంలో పోలవరం విషయంలో షెకావత్ చేసిన విమర్శలు కూడా వైసీపీ ని బాగా ఇబ్బందిపెట్టాయి.

ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతల కారణంగానే షెకావత్ ఆ విధంగా మాట్లాడారని, తాను ఎంత దగ్గరవుదామనుకున్నా బీజేపీ తనను పక్కన పెడుతోందని, కానీ అదే సమయంలో టీడీపీకి మేలు జరిగేలా వ్యవహరిస్తోంది అన్న బాధ జగన్ లో ఎక్కువగా కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు